![]() |
![]() |

"నీతోనే డాన్స్" షోలో ఈ వారం జంటలన్నీ బాగా డాన్స్ చేసి అందరినీ ఫిదా చేసేశాయి. కాస్ట్యూమ్స్, తీసుకున్న థీమ్ తో ఓ రేంజ్ దుమ్ము దులిపేసారు. అలాంటి జోడీస్ లో సాగర్-దీప జోడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్ళు లాస్ట్ వీక్ కూడా మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. ఈ వారం కూడా చేసారు కానీ లాస్ట్ వీక్ వచ్చినన్నీ మార్క్స్ మాత్రం ఈ వారం రాలేదు. "సాగర్ నిన్ను ఎంత ఇష్టపడతాడు అనే టాపిక్ చాలామందిలో ఉంది..సాగర్ నిన్ను ఎంత ఇష్టపడతాడో చెప్పు:అని శ్రీముఖి అడిగేసరికి " ఈరోజు మార్నింగ్ ఫైట్ అయ్యింది. సెట్ కి రావడం ఆలస్యమైపోతుందని దీపాని క్యాబ్ బుక్ చేయమన్నాను...ఐతే దీపా పుచ్చకాయ కట్ చేస్తోంది.
నేను క్యాబ్ బుక్ చేయమనేసరికి బాగా కోపం వచ్చేసింది నన్నే బుక్ చేయమంది.. ఇక్కడికి వచ్చాక కూడా ఆ డిస్టర్బన్స్ పోలేదు.. ఆమె కోపం తగ్గించడానికి నేనే ఆమెకు దోశ తినిపించాను." అని సాగర్ ఫన్నీగా తమ మధ్య జరిగిన విషయాలను చెప్పారు. "అవును నేను విన్నాను..దోశ ఎలా ఉంది అని అడిగారు" అంటూ ప్రియాంక మధ్యలో వచ్చి చెప్పేసరికి "ఐనా పక్కింటివాళ్ల విషయాలు ఎందుకు వింటున్నావు.. " అని శ్రీముఖి అడిగింది. "ఆయన మరి అంత గట్టిగా అడిగారు..అది నాకు వినిపించింది" అని చెప్పింది సీరియస్ గా. "శివ్ మీ ఆవిడని కంట్రోల్ లో ఉంచుకో" అని మళ్ళీ శ్రీముఖి అనడంతో "ప్రేమ ఎక్కడ ఉంటుందో గొడవలు కూడా అక్కడే ఎక్కువగా ఉంటాయి.. ఐనా ఆవిడే నన్ను కంట్రోల్ లో పెడుతుంది" అంటూ టంగ్ స్లిప్ అయ్యాడు శివ్. "మరి రాధమ్మ మీరు మీ ఆయన మధ్య ఎప్పుడైనా ఐ లవ్ యు, ఐ మిస్ యు లాంటి మెసేజెస్ ఉంటాయా" అని శ్రీముఖి అడిగింది. "ఆయన బయటికి వెళ్ళేటప్పుడు నా నుదిటి మీద ఒక ముద్దు ఇస్తారు...అలాగే ఇంటికి తిరిగి వచ్చాకా ఏదో పదేళ్ల తర్వాత కలుసుకున్నట్టుగా ఒక హగ్ , కిస్ ఇస్తారు. నాకు ఆయన అలా ఇవ్వకపోతే మాత్రం కొంచెం ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది ఆరోజు " అని చెప్తూ సిగ్గుపడిపోయారు రాధ.
![]() |
![]() |